Tuesday, May 21, 2024
- Advertisement -

మందు, బాలీవుడ్ డ్యాన్సర్స్, పాప్ సింగర్స్……… వాహ్….. వాటే బిజినెస్ సమ్మిట్

- Advertisement -

చంద్రబాబుకు లోకేష్ తోడయితే ఎలా ఉంటుందో తెలుసా? నారా లోకేష్ వారి మందు, విందుల ఫొటోల వ్యవహారం గుర్తుందిగా…….ఆ ఫొటోలు బయటపడ్డప్పుడు కూడా సిగ్గు పడకపోగా…….అయితే ఏంటి? అలాంటివి ఇంకో బోలెడన్ని ఫొటోలు ఉన్నాయి అని లోకేష్ బాబు విలువల గురించి మాట్లాడుతున్నవాళ్ళను ఎద్దేవా చేశాడు. ఇప్పుడు తన మార్క్ ట్రెండ్‌ని బిజినెస్ సమ్మిట్‌లో కూడా చూపించాడు. ఆ మధ్య బీచ్ ఫెస్టివల్ అంటూ వైజాగ్‌ని అడల్ట్ ప్రదేశంగా మార్చే ప్రయత్నాలపై మహిళా సంఘాలు విరుచుకుపడడంతో వెనక్కితగ్గారు.

కానీ ఇప్పుడు బిజినెస్ సమ్మిట్‌లో మాత్రం రాఘవేంద్రరావు సినిమా స్టైల్‌లో మత్తెక్కించేలా ఇరగదీశారు. మందు, విందులను స్వయంగా ప్రభువులవారే దగ్గరుండి అతిథులకు అందించారు. బాబుగారు ఎంతో ఇష్టపడే దుబాయ్ సమ్మిట్‌తో సహా ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ట్రెండ్‌ని సృష్టించారు నారా బాబులు. బిజినెస్ సమ్మిట్ అంటే ఇప్పటి వరకూ హుందాగా, మనీ లెక్కలతో ఉండే వ్యవహారాలు మాత్రమే జనాలకు తెలుసు. కానీ సినిమావాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉండే బాబుగారు……ఈ సారి రాఘవేంద్రరావు సలహాలు తీసుకున్నారో………రాజమౌళి సలహాలు తీసుకున్నారో కానీ మందు, విందులతో బిజినెస్ సమ్మిట్‌ని రసరంజితం చేశారు. బాలీవుడ్ గర్ల్స్, పాప్ సింగర్స్‌తో అతిథులకు గుర్తుండిపోయే స్థాయిలో విందులను అందించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును మరోసారి నిలువునా పాతేశారు బాబు. గుజరాత్‌లో నరేంద్రమోడీతో సహా చాలా మంది ముఖ్యమంత్రులు బిజినెస్ సమ్మిట్స్ నిర్వహించినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మందు, విందు, బాలీవుడ్ డ్యాన్సర్స్, పాప్ సింగర్స్‌తో ఖుషీ చేయడం…..చేయించడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అభివృద్ధి అంటూ ఐదు శాతం కనిపించినా కూడా దానికి నారా చంద్రబాబు నాయుడు రోజుకు 32గంటలు పడిన కష్టంతో పాటు లోకేష్ బాబు దివ్యమైన తెలివితేటలు కూడా కారణం అని చెప్పి భజన చేయించుకునే బాబు, చేసే పచ్చ మీడియా ఈ సారి ఆ లోకేష్ ప్రేరణతోనే బాబు అరేంజ్ చేసిన ఈ మందు-విందుల గురించి ఎంత గొప్పగా చెప్తుదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -