ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణంపై షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు అనుకున్నట్లు ఆమె గుండెపోటు కారణంగా చనిపోలేదని ప్రమాదం కారణంతో ఆమె చనిపోయారు. అనుకోకుండా జారీ ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు శవ పరీక్ష నివేదికను అప్పగించారు.
శ్రీదేవి మరణం పై వచ్చిన ఫొరెన్సిక్ రిపోర్ట్ సంచలనంగా మారింది. మొదట శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని మ శ్రీదేవి గుండెపోటుతోనే చనిపోయిందని నిర్ధారించిన పోలీసులు.. ఇప్పుడు రిపోర్ట్ లో మాత్రం చాలా షాకింగ్ కారణం చెప్పారు. ఆమె ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిపోయారని, ఆమె ఆ సమయంలో ఆల్కాహాల్ కూడా సేవించివిన్నారని రిపోర్టులో రాసుంది.
ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడిన ఆమెఊపిరిఆడక చనిపోయారని, ఆ సమయంలో ఆమె అల్కాహల్ సేవించివున్నారని, ఆమె బాడీలో అల్కాహల్ వుందని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. కాగ ఆమె భౌతికకాయాన్ని ముంబయి తరలించేందుకు ఏర్పాట్లను కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్ది సేపట్లో ఆమె భౌతికకాయం ముంబయికి రానుంది.
