సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికె మంత్రి నారాయణ స్పాట్ పెట్టాడా…? పరిస్థితులు అలానె ఉన్నాయి. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు.
అసలు విషయానికి వస్తే రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ పరంగా ఉన్న అడ్డంకులను తొలగిస్తూ.. ఎన్జీటీ( నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు.
కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. కాగా.. మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్ తో టీడీపీ నేతలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసం తొలిగించటం సాధ్యమేనా అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.
ఇదంతా చూస్తుంటె కేవలం ముఖ్యమంత్రి ఇంటి పై వస్తున్న విమర్శలను తప్పించుకోవటం కోసమే ఈ విధంగా చెప్పారనే వాదన కూడా వినిపిస్తోంది. కేవలం ముఖ్యమంత్రి నివాసమే కాదు..పలువురు ప్రముఖుల గెస్ట్ హౌస్‌లు కూడా అదే ప్రాంతంలో ఉన్నాయి. మరి..ప్రభుత్వం వీటి పై ఏం చేస్తుందో చూడాలి. నారాయణ అనుకున్నంత పనిచేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.
