ప్రిన్స్ మహేశ్‌బాబు ఎక్కడున్నాడో తెలియడం లేదు. తన సినిమా కోసం విదేశాలకు వెళ్లాడని, లేదు హైదరాబాద్‌లోనే ఉన్నాడని, ఇటీవల తన మేన కోడలు శారీ ఫంక్షన్‌కు హాజరైన దృశ్యాలే తెలుపుతున్నాయని సినీ వర్గాల సమాచారం. అవన్నీ పక్కన పెడితే మహేశ్‌బాబు కుటుంబంతో విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. అమెరికాలోని డిస్నీల్యాండ్ సందర్శించినట్టు కొన్ని ఫొటోలు లభించాయి.
ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం అమెరికాకు వెళ్లగా డిస్నీల్యాండ్‌తో పాటు టుమారోల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటివి ఎన్నో కుటుంబంతో కలిసి చూసేశారు. పిల్లలు ఎంజాయ్ చేసే ఎమ్యూజ్‌మెంట్ పార్కులు, సందర్శనీయ స్థలాలను హాలిడే ట్రిప్ మహేశ్‌బాబు కుటుంబంతో కలిసి ప్లాన్ వేశాడు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతున్నారట! మహేశ్ కుటుంబంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని కుటుంబం కూడా ఈ యాత్రకు వారితో కలిసి వెళ్లారని తెలుస్తోంది.
మహేశ్ కుమారుడు గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితార నవీన్ ఎర్నేని పిల్లలతో బాగా కలసిపోయారు. ఆ విషయం ఈ ఫొటోలను చూస్తే తెలిసిపోతోంది. మహేశ్‌బాబుతోపాటు భార్య నమ్రత, గౌతమ్, సితార కూడా వెళ్లారు. ఆ యాత్రలో ఉల్లాసంగా పాల్గొంటున్న మహేశ్ నెక్ట్స్ చిత్రంతో బిజీ అయిపోతాడు. రెండు రోజుల్లో దేశానికి వచ్చేస్తారట! ప్రస్తుతం మహేశ్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నారని టాక్.




