రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది మిర్యాలగూడ ప్రణయ్ హత్య. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్‌ను హత్య చేయించాడు. అప్పట్లో ఈ హత్య పెను దూమారమే లేపింది. అగ్ర కులాలు దళితులపై దాడిని ఖండిస్తు ధర్నాలు చేపట్టారు కూడా. మీడియా సైతం ఈ పరువు హత్యను బాగా కవర్ చేసింది. ప్రణయ్ మరణించే సమయానికే అమృత ఐదు నెలల గర్బవతి. అయినప్పటికి కనికరం లేకుండా , ఆమె తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను హత్య చేయించాడు. తన తండ్రి,బాబాయ్‌లను ఊరి తీయలని డిమాండ్ చేసింది అమృత.
తాజాగా అమృత పండంటి మగబిడ్డకు జన్మినిచ్చినట్లు సమాచారం. మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం అమృతకు మగ బిడ్డ పుట్టినట్లు ప్రణయ్ తల్లిదండ్రులు తెలిపారు. మగ బిడ్డ పుట్టడంతో తమ ఇంట్లోకి మళ్లీ ప్రణయ్ వచ్చినట్లుందని వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమృతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని ఆ పార్టీ నేతలు గతంలో హామీ ఇచ్చారు. కావాలంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కాని అప్పటికే గర్భవతి అయిన అమృత, ప్రసవం అయిన తరువాత తనకు పుట్టబోయే పిల్లలు కోసం ఉద్యోగం చేస్తానని తెలిపింది.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’