Friday, April 26, 2024
- Advertisement -

నా కొడుకు ఎదుగుతున్నాడంటూ నిహారిక కొణిదెల పోస్ట్..?

- Advertisement -

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా వేదికగా ఎన్నో చిలిపి పనులు చేసే నిహారిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. పెళ్లి తర్వాత ఏ మాత్రం తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ సమయంలో తన లైఫ్ ఎంతో బోర్ గా ఉందని ఫీలవుతోంది. ఈ క్రమంలోనే అత్తారింట్లో ఉన్న నిహారిక వీలున్నప్పుడల్లా వంటింట్లో దూరి కొత్త కొత్త వంటలను ప్రయోగం చేస్తుంది.

గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఆపిల్ పై రెసిపీని చేసి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా ఎంతో అందంగా ముస్తాబవుతూ తయారైన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిహారిక పెళ్లి తర్వాత జరిగిన మొట్టమొదటి పుట్టిన రోజు కానుకగా తన భర్త ఇచ్చిన గిఫ్ట్ గురించి మనకు తెలిసినదే.

Also read:బిడ్డను అదిమిపట్టుకున్న అనుష్క శర్మ.. ఫొటోగ్రాఫర్లు దారుణంగా?

నిహారిక పుట్టినరోజు కానుకగా ఒక స్పెషల్ పెట్ డాగ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ డాగ్ ను నిహారిక తన పెద్ద కొడుకుగా భావించి దానికి బజ్ అని నామకరణం కూడా చేశారు. తనకు ఏం తోచనప్పుడు తన బజ్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటానని నిహారిక తెలిపారు. తాజాగా నిహారిక తన బేబీ బాయ్ ఎంతో పెద్దగా అవుతున్నాడని మురిసిపోతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:క్రేజి ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ నటులు వీళ్ళే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -