సూపర్ స్టార్ మహేశ్ బాబును ప్రముఖ సీనియర్ నటి, ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి పొగడ్తలతో ముంచేశారు. రీల్ లైఫ్‌లో హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్‌లో మహేశ్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న చిన్నారుల కోసం మహేశ్ ఓ చారిటీ సంస్థను స్థాపించారు.
ఇప్పటికే ఆయన ఎందరో చిన్నారుల ప్రాణాలను కాపాడి వారి తల్లిదండ్రుల పాలిట దైవంగా నిలిచారు. దీంతో అందరూ మహేశ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా సెల్వమని కూడా “చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేశ్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నాను” అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మహేశ్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోందీ ఈ చిత్రం.
హాట్ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు