కేరళను తాకిన రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించాయి. రుతుపవనాలు శుక్రవారం నాడు ఒంగోలు జిల్లాలోకి ప్రవేశించాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు నానాటికి పురోగమిస్తున్నాయని, మరో రెండు రోజుల్లో ఇవి మరింత బలపడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు తమిళనాడులో పూర్తిగా విస్తరించాయి.
దీని ప్రభావంతో మధురలో భారీ వర్షాలు కురిసాయి. ఉపరితల ఆవర్తనం బలహీరన పడిందని, బంగ్లాదేశ్ పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవన రేఖ అనంతపురం, ఒంగోలు మధ‌్య బంగాళాఖాతం వరకూ పయనిస్తోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా రాజస్ధాన్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అక్కడ అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.