Friday, May 9, 2025
- Advertisement -

మారుతున్న నల్లగొండ రాజకీయం

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీకి తెలంగాణలో ఉన్న ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కారు ఎక్కనున్నట్లు ప్రచారంజరుగుతోంది. ఇందుకోసం ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో మాట్లాడారు. అలాగే వారం రోజుల క్రితం మంత్రి హరీష్ రావుతో కారులో ప్రయాణం చేసి తన చేరిక గురించి చర్చించినట్లు సమాచారం.

గుత్తా సుఖేందర్ తో పాటు మిర్యాలగుడా కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వంపైనా, కెసిఆర్ పైనా ఒంటరి పోరాటం చేస్తునే ఉన్నారు. ఇటీవల మారిన పరిణామాల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో, అధిష్టానంతోనూ ముభావంగా ఉంటున్నారు.

హఠత్తుగా సుఖేందర్ రెడ్డి శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో కెసిఆర్ ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనలేదు సరికదా.. ఒకవిధంగా ఆయనను పొగిడారు. దీంతో గుత్తా చేరిక ఖాయమేనని అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -