Saturday, May 18, 2024
- Advertisement -

బీజేపీ, మోడీజీ.. ఈ క్రెడిట్ ను తీసుకొంటారా..?!

- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ… భారతీయ జనతా పార్టీ నేతలు ఒక ప్రచారాన్ని హోరెత్తించారు. దేశంలో పెట్రలో ధరలు తగ్గుతున్న నాటి పరిణామాల మధ్య అది తమ ఘనతేనని వారు ప్రచారంచేసుకొన్నారు.

దేశ ప్రజలు తెలివైన ఎంపిక చేసుకొన్నారని.. తన లాంటి అదృష్టవంతుడిని ప్రధానిగా చేసుకొన్నారని.. దీంతో పెట్రోధరలు కూడా తగ్గుతున్నాయని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారం చేసుకొన్నారు.

మరి పెట్రో ధరలు అనేవి అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయని.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితేనే దేశీయంగా పెట్రోధరలు తగ్గాయనే విషయం అందరూ ఎరిగినదే అయినా.. కూడా మోడీ మాత్రం అది తమ ఘనత అని ప్రచారం చేసుకొన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రూడ్ ధరతో పోలిస్తే.. దేశీయంగా పెట్రో ధరలు ఎక్కువ స్థాయిలోనే అమ్ముతున్నా.. ప్రభుత్వ దాన్ని అదునుగా మార్చుకొని ప్రత్యేక సుంకాలు వేసుకొన్నా..మోడీ మాత్రం దాన్ని అందంగా సమర్థించుకొన్నాడు.

పెట్రోధరలు తగ్గాయి.. ఇదే నా సత్తా అన్నారు. అయితే మోడీ అలా ప్రచారం చేసుకొన్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది అది వేరే కథ. మరి ఇలా కొన్నినెలలు అయినా గడిచాయో లేదో..అప్పుడే పెట్రో ధరలు పెరిగాయి. ఏకంగా లీటరు పెట్రోలుపై మూడు రూపాయలా 96 పైసలు పెరిగింది. డీజిల్ పై 2.37 రూపాయలు పెంచారు. మరి ఇప్పుడు ఇది ఎవరి ఘనత అనాలి? తగ్గినప్పుడు క్రెడిట్ ను సొంతం చేసుకొన్న మోడీ జీ, కమలనాథులు.. ఇప్పుడు  పెంపు క్రెడిట్ ను కూడా తీసుకొంటారా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -