Sunday, May 4, 2025
- Advertisement -

నల్లగొండలో నరబలి

- Advertisement -

నల్లగొండ జిల్లాలో నరబలి వార్త కలకలం రేపుతోంది. ఒక వ్యక్తిని అతి పాశవికంగా హత్య చేసిన దుండగుల ఆతని తలను మహంకాళి అమ్మవారి పాదాల ఉంచి పరారయ్యారు. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన నాగార్జునసాగర్ హైవే రోడ్డుపై ఉన్న చింతపల్లి మండలం గొల్లపల్లి విరాట్ నగర్ లో చోటు చేసుకుంది.

ఉదయం అటుగా వెళుతున్న స్థానికులకు అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల కనిపించడంతో షాక్ కు గురయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం సాయంతో దర్యాప్తును చేస్తున్నారు.

పాత కక్షల ఆధారంగా హత్య చేశారా ? లేక క్షుద్ర పూజల కోసం ఇలా చేశారా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొండెం కోసం చుట్టు పక్కల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ టీంలు రంగలోకి దిగాయి.

కన్న కొడుకుపై తండ్రి లైంగిక దాడి

హై అలర్ట్.. తెలంగాణలో కరోనా కలకలం

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -