Friday, April 26, 2024
- Advertisement -

హై అలర్ట్.. తెలంగాణలో కరోనా కలకలం

- Advertisement -

రాష్ట్రంలో మూడో వేవ్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజు రోజుకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగున్నాయి. తాజానా 65 వేల మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో 2,300 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. పాజిటివిటీ రేటు 4 శాతంగా నమోదైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6.89 లక్షలకు చేరుకుంది. ఇాప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే అధిక కేసులు నమోదు కాగా తాజాగా రెండు, మూడు రోజులుగా అన్ని జిల్లాల్లోనూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

అన్ని జిల్లాల్లో పాజిటివ్ శాతం దాదాపు 10 శాతం పైనే నమోదు అవుతోంది. దీంతో అన్ని జిల్లాలకు ఒమిక్రాన్ వ్యాప్తి ప్రారంభమైనట్టేనని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారు, రెండో డోసును వెంటనే తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా జనవరి 1 నుంచి 15 ఏళ్లు పైబడిని వారికి కూడా వ్యాక్సిన్ ను ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -