Monday, April 29, 2024
- Advertisement -

బుకీలతో సంబంధం ఉందని నిరూపిస్తే గంటలో పదవికి రాజీనామా చేస్తాః కోటంరెడ్డి

- Advertisement -

మహిళల అత్యాచారాలు, లైంగిక వేధింపులు లాంటి క్రైమ్స్‌లో తెదేపా మంత్రుల స్థాయి నేతల పేర్లు వినపడేసరికి పచ్చ బ్యాచ్ మొత్తం రెడీ అయిపోయింది. సడన్‌గా క్రికెెట్ బెట్టింగ్ మాఫియా అంటూ కొత్తరాగం మొదలెట్టింది. అందులో వైకాపా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి నిందుతుడు అన్నట్టుగా పచ్చ బ్యాచ్ మొత్తం ప్రచారం చేస్తోంది. ఇదే విషయంపై తాజాగా కోటంరెడ్డి స్పందించాడు.

దొంగ నాటకాలొద్దు చంద్రబాబూ అని మొదలెట్టిన కోటం రెడ్డి……. బుకీలకు మద్దతుగా ఎస్పీకి కాల్ చేసి ఉంటే ఎప్పుడు కాల్ చేశానో చెప్పండి, కాల్ డేటా ఉంటే చూపించండి. ఇక విజయవాడ హోటల్‌లో బుకీలను కలిసి ఉంటే ఆ ఆధారాలు చూపండి. సిసి టివీ ఫుటేజ్‌లో ఆ పరిసరాల్లో నేను ఉన్నట్టు నిరూపించినా చాలు……..గంటలో పదవికి రాజీనామా చేస్తా……..రాజకీయ సన్యాసం స్వీకరిస్తా…….చంద్రబాబుకు ఇదే నా సవాల్. అబద్ధపు ప్రచారాలు, అసత్యాలతో ప్రత్యర్థి నాయకులను దెబ్బతీసే ప్రయత్నాన్ని ప్రజలు హర్షించరు. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా…..ఒక్క సాక్ష్యం చూపించండి చాలు…..రాజకీయ సన్యాసానికి రెడీ అని కోటం రెడ్డి బాబుకు సవాల్ విసిరాడు. అలాగే తెదేపా మంత్రులకు సన్మానాలు చేసిన బుకీలకు, మంత్రుల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బెట్టింగ్ రాయుళ్ళకు ఎందుకు శిక్షలు లేకుండా పోతున్నాయని, టిడిపి నేతలతో సన్నిహితంగా ఉంటే ఎందుకు వదిలేస్తున్నారని కూడా కోటం రెడ్డి ప్రశ్నించాడు. కోటంరెడ్డి లాంటి నాయకుడు పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తే అది వైకాపాకు చాలా నష్టం……టిడిపికి లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. మరి కోటం రెడ్డి ఇచ్చిన బంపర్ ఆఫర్‌ని బాబు వినియోగించుకుంటాడా? పచ్చ బ్యాచ్‌వి అబద్ధాలు, అసత్య ప్రచారం కాదు…… నిజాలు అని నిరూపిస్తాడా? ఒక్క సాక్ష్యం చూపించగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -