పెద్ద నోట్లు తర్వాత వాటి స్థానంలో కొత్త 500, 2000 నోట్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా రోజుకో కొత్త నోటు బయటకు వస్తోంది. సోషల్ మోడియాలో ఇప్పటివరకు దాదాపు అన్ని డినామినేషన్లలోనూ కొత్త నోట్లకు సంబంధించిన ఫొటోలు తెగ చక్కర్లు కొట్టాయి.
వెయ్యి నోటు కూడా వస్తుందంటూ అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ఇప్పుడు ఐదు రూపాయల కరెన్సీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిగో కొత్త ఐదు రూపాయల నోటు అంటూ ఓ ఫొటో వాట్సప్, ఫేస్‌బుక్‌లల్లో హల్‌చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ కొత్త నోటు తెస్తామంటూ ఇప్పటిదాక రిజర్వుబ్యాంకు కూడా ఎప్పుడు ప్రకటించలేదు. ఆ మాట కొస్తే కొత్త 200, 50 రూపాయల నోట్లు ఇప్పటికీ జనం చేతికి అందలేదనుకోండి.. అది వేరే విషయం.
కొత్తగా సొషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న ఐదు రూపాయల నోటు.. నకిలీ నోట్ అని, ఫొటో ఎడిటింగ్ టూల్స్ ద్వారా దాని రంగు మార్చారనీ అంటున్నారు. కొత్త 50 రూపాయల నోటును ఎడిటింగ్ టూల్స్ ద్వారా రంగు మార్చగలిగారే గానీ.. దానిపై `పచాస్ రూపయే` అనేది మార్చడం మరిచిపోవడంతో ఈ నోటు ఫేక్ అని తెలుస్తోంది.