Monday, April 29, 2024
- Advertisement -

ఆధానీపై విచారణ.. ఎందుకు మౌనం మోడీజీ ?

- Advertisement -

ప్రపంచ కుబేరుల జాబితాలో మొన్నటి వరకు టాప్ 2 లో కొనసాగిన గౌతమ్ ఆధానీకి గత వారం రోజులుగా గడ్డు పరిస్థితులు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. అమెరికాకు చెందిన హిండెన్ బర్డ్ ఇచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆధానీ గ్రూప్స్ కుదేలు అయ్యాయి. ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 లో కూడా చోటు కోల్పోయారు గౌతమ్ ఆధానీ, ఆధానీ గ్రూప్స్ స్టాక్ మార్కెట్ లో ఎన్నో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని హిండెన్ బర్గ్ ఆధారాలతో సహ బయట పెట్టడంతో ఆధానీ కంపెనీ షేర్స్ భారీగా పతనం అయ్యాయి. ఫలితంగా ఆధానీ గ్రూప్ యజమాన్యంలోని కంపెనీలు వారం తిరిగే సరికి వంద బిలియన్ డాలర్లను కోల్పోయాయి.

దాంతో ఆధానీ సంపద 61.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దాంతో బ్లూమ్ బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ జాబితాలో ఆధానీ స్థానం 22 కు పడిపోయింది. మొత్తానికి హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు ఆధానీ గ్రూప్స్ ను కుదేలు చేశాయి. అయితే ప్రస్తుతం ఆధాన్నీ పతనం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. ఆధానీ ఆస్తులపై కేంద్రం దర్యాప్తు చేపట్టగలదా ? అనే ప్రశ్నలను సందిస్తున్నాయి. మొదటి నుంచి కూడా గౌతమ్ ఆధానీకి మోడీ సర్కార్ అండగా నిలుస్తోందనే వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆధానీ పై వస్తున్న ఆరోపణల విషయంలో మోడీ సర్కార్ వైఖరి ఎంటనేది ఆసక్తికరంగా మారింది.

ఇంతవరకు ఆధానీ విషయంలో ఎలాంటి స్పందన తెలియజేయని మోడీ సర్కార్.. తదుపరి ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తికరమే. మరోవైపు ఆధానీ విషయంలో స్పందించాలని విపక్షాలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా లోక్ సభలో రాహుల్ గాంధీ ఇదే విషయంపై మోడీ సర్కార్ ను ప్రశ్నించారు. ” దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, భవనాలు.. ఇలా అన్నీ ప్రాజెక్ట్ లు ఆధానీకే కట్టబెట్టరాని, దేశం మొత్తాన్ని ఆదానీ కే అప్పగిస్తారా ? అంటూ ద్వజమెత్తారు. ఆధానీ విషయంలో హిండెన్ బర్డ్ ఇచ్చిన నివేధికపై మోడీ ప్రభుత్వం స్పందించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆధానీ షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉందా అంటూ సవాల్ విసిరారు. ఇలా ఆధానీ విషయంలో ప్రతిపక్షాలు మోడీ సర్కార్ పై వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో మోడీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

అవన్నీ సామాన్యులకే.. నేతలకు కాదు !

ఇండియా వద్దు ఫారెన్ కంట్రీస్ ముద్దు!

మోడీ పాలనపై.. ప్రజా నాడీ ఏం చెబుతోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -