Monday, April 29, 2024
- Advertisement -

మోడీ పాలనపై.. ప్రజా నాడీ ఏం చెబుతోంది ?

- Advertisement -

గత ఎనిమిదేళ్లుగా దేశంలో ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతోంది. అయితే ఎన్డీయే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నరేంద్రమోడీ మేనియా అనే చెప్పాలి. 2014 టైమ్ లో గుజరాత్ మోడల్ అంటూ దేశ ప్రజలను విపరీతంగా ఆకర్షించి అధికారం చేపట్టిన మోడీ.. ఇక ఆ తరువాత తనదైన రీతిలో పరిపాలిస్తూ దూసుకుపోస్తున్నారు. మోడీ పాలనపై ప్రజలు కూడా సంతృప్తిగానే ఉండడంతో 2019 ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు దేశప్రజలు. అయితే 2019 తరువాత మోడీ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలు మోడీ పాలనకు ప్రత్యామ్నాయం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. .

ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే.. ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఇండియా టుడే సర్వే నిర్వహించింది. ” మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ” పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో మెజారిటీ పీపుల్స్ మోడీ పాలనకే ఓటేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 284 సీట్లు, కాంగ్రెస్ కు 191 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. అయితే గత ఏడాది సర్వేలో ఎన్డీయే పాలనపై 56 శాతం సానుకూల స్పందన రాగా.. ఈఏడాది 11 శాతం పెరిగి 67 శాతానికి చేరుకుంది.

అయితే తాజాగా ఇండియా టుడే నివహించిన సర్వేలో 1,40,917 మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ సర్వేను బట్టి రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గతంలో పోలిస్తే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కూడా గట్టిగానే బలపడుతోంది. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి ఊహించని విధంగా ప్రజాస్పదన లభిస్తోంది. దీంతో ఎన్డీయే కూటమిని కాదని ప్రజలు మార్పు కోరుకుతున్నారా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా మోడీ ప్రభంజనం కొనసాగడం ఖాయం అని కాషాయ దళం కాన్ఫిడెంట్ గా ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో ప్రజా నాడీ ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

టార్గెట్ ఏపీ.. కేజ్రీవాల్ ప్లాన్ అదే !

బాబు, పవన్, లోకేశ్.. మీలో ఎవరు సి‌ఎం ?

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్.. సిద్దమైన బీజేపీ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -