Tuesday, May 7, 2024
- Advertisement -

ప్యాంట్లు బంద్.. పంచెలే కట్టాలి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులకు కొత్తగా డ్రెస్ కోడ్ వచ్చింది. ఇక మీదట టీచర్లు ప్యాంట్లు, రంగురంగుల చొక్కాలు ధరించకూడదని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నది.

టీచర్లంతా విధిగా  తెల్ల పంచెలు, చొక్కాలు వేపుకోవాలని, జీన్స్ ప్యాంట్లు, ఆ ప్యాంట్లకు జేబులు ఉండడం వంటి ఫ్యాషన్ లకు దూరంగా ఉండాలని త్వరలో జీవో విడుదల చేయనుంది. సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో విలువుందని, దానిని కాపాడడంలో భాగంగా ఈ డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

అయితే ఈ డ్రెస్ కోడ్ ను ఉపాధ్యాయులు అంగీకరించడం లేదు. ఈ మధ్యే ఉద్యోగంలో చేరిన వారు ఈ డ్రెస్ కోడ్ తో ఇబ్బంది పడతారని వారంటున్నారు. పైగా విద్యార్ధులకు చదువు చెప్పడం ముఖ్యం కాని ఈ డ్రెస్ కోడ్ లు ముఖ్యం కాదని వారంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -