- Advertisement -

ఆల్ కాయిదాకు మద్దతుపై భగ్గుమన్న అమెరికా

- Advertisement -

బరాక్ ఒబామ. అమెరికా అధ్యక్షుడు. మరికొంత  కాలంలో పదవి నుంచి దిగి మాజీ అయిపోయే వ్యక్తి. ఇలాంటి సమయంలో ఆయనపై పిడుగు పడింది. సిరియా డిక్టేటర్ ను పదవి నుంచి దించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు పలకారనడానికి ఆధారాలు బయటపడ్డాయి. దీంతో ఒబామా మెడకు ఉచ్చు బిగిసినట్టు అయ్యింది. ఇరాక్ లో ఆల్ కాయిదా సంస్ధను పెంచి పోషించింది ఒబామాయేనని, అదే ఆ తర్వాత ఐఎస్ గా రూపాంతరం చెందిందంటూ ఏ నిఘా  సంస్ధ వెల్లడించింది.

రష్యా, ఇరాన్, చైనా మద్దతిస్తున్న సిరియా డిక్టేటర్ బషర్ అల్ అసద్ ను గద్దె దించేందుకు పాశ్చాత్య గల్ఫ్ దేశాలు మద్దతు ఇచ్చాయని ఆ నిఘా సంస్ధ తన నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ఒబామా ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయి అధికారులకు, కొన్ని సంస్ధలకు అందాయి. దీంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న హిల్లరి క్లింటన్ కు కూడా వ్యక్తిగతంగా ఈ నివేదిక అందజేశారని తెలుస్తోంది.

సిరియా అధ్యక్షుడ్ని గద్దే దించాలంటే ఆల్ కాయిదా మద్దతు అవసరమని పాశ్చాత్య దేశాలు విశ్వసించాయని, అందుకే ఒబామా ఆల్ కాయిదాకు మద్దతు ఇచ్చారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక తన దగ్గరే ఉన్నా హిల్లరీ మాత్రం దీనిపై ఎలాంటి వ్యాఖ్యాలు చేయలేదు. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఐఎస్ ఎదగడానికి ఒబామా, హిల్లరీలే కారణమంటూ మండిపడ్డారు. దీనిపై ఒబామా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -