- Advertisement -

కేంద్రం ఇచ్చిన మరో కానుక

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి, ఇక్కడి ప్రజలకు మరో కానుక ఇచ్చింది. అదే పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు. హైదరాబాద్, వరంగల్ మధ్య ఒకటి, హైదరాబాద్, నాగపూర్ ల మ‌ధ్య మరో పారిశ్రామిక కారిడార్ ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్, ఫార్మాసిటీ, టి హబ్ వంటి వాటితో పాటు కొత్తగా  ఈ రెండు పారిశ్రామిక కారిడార్లు రావడం తెలంగాణకు వరమే. రాష్ట్రంలో ఒక్క పారిశ్రామిక కారిడార్ కూడా లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపాదనలు పంపింది.

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కారిడార్ల ఏర్పాటుకు అనుమతి కోరితే కేంద్రం తొలి దశలో రెండు కారిడార్లను ఏర్పాటు చేస్తూ అనుమతులు మంజూరు చేసింది. ఈ కారిడార్ల ఏర్పాటుతో రోడ్డు, రైలు రవాణా వంటి మౌలిక సదుపాయలు పెరగడం, దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతులకు వీలు కలుగుతుంది. ఈ కారిడార్లు ఏర్పాటు అయితే విద్యుత్ పంపిణీ, నీటి లభ్యత, అంతర్గత మౌలిక సదుపాయాల కల్పన వంటివి వస్తాయి.

ఇక పారిశ్రామిక వేత్తలకు ఒకే చోట పరిశ్రమలు స్ధాపించుకునే వీలు కలుగుతుంది. దీని వల్ల అనుమతుల విషయంలో కాని, ఇతర అవసరాల విషయంలో కాని ఆలస్యమయ్యే అవకాశం ఉండదు. ఈ కారిడార్లలో వస్త్ర పరిశ్రమ, డ్రైపోర్టు, మైనింగ్, ఇంజనీరింగ్, చేనేత, హస్తకళలు వంటి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -