Friday, May 17, 2024
- Advertisement -

మహిళలు, ముసలి వారి పెండింగ్ కేసులు 12 శాతం

- Advertisement -

దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 2.16 కేసులు పెండింగ్ లో ఉన్నాయని సుప్రీంకోర్టు ఈ కమిటీ పేర్కొంది. ఇందులో 12 శాతానికి పైగా ముసలివారు, మహిళలు పెట్టిన కేసులే ఎక్కువని పేర్కొంది. తమ కేసు సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావాలని దేశంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కమిటీ పెండింగ్ కేసుల నివేదిక విడుదల చేయడం గమనార్హం.

వివిధ ప్రాంతాల్లో ముసలి వారు దాఖలు చేసిన కేసులు 6,96,704 కాగా మహిళలు దాఖలు చేసిన కేసులు 20,94,086 కావడం గమనార్హం. దేశంలో అత్యధిక కేసులు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 51,13,978 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 29,16,559 కేసుల పెండింగ్ తో మహారాష్ట్ర రెండో స్ధానంలో ఉంది.

అయితే మహిళలు దాఖలు చేసిన కేసుల్లో మాత్రం మహారాష్ట్రదే అగ్రస్ధానం. ఇక్కడ 2,55,122 కేసులు మహిళలు దాఖలు చేసినవి పెండింగ్ లో ఉన్నాయి. మహిళల కేసుల పెండింగ్ జాబితాలో బీహార్ రెండో స్ధానంలో ఉంది. ఇక్కడ మహిళలు దాఖలు చేసిన 2,16,599 కేసులు పెండింగ్ లో ఉండడం విశేషం.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -