- Advertisement -
క్షవరం అయితే తప్ప వివరం తెలియదని ఓ మోటు సామెత. ఇది తమిళనాడు నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ కు అక్షరాలా వర్తిస్తుంది. తాజా ఎన్నికల్లో తన పార్టీ ఖాతా తెరవకపోవడంతో విజయ్ కాంత్ ఇక సినిమాలపైనే నా ధ్యాస అంటున్నారు.
శుక్రవారం నాడు ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే తాను, తన పార్టీ గల్లంతు కావడంతో ఆసమయంలోనే ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నానంటూ పార్టీ అధికారిక ట్వట్టర్ లో పేర్కొన్నారు. మనకి విజయం కాస్త దూరమైంది. అంత మాత్రానా మనం కుంగిపోవాల్సిన పని లేదు.
ఈ పరాజయానికి కుంగిపోకుండా నా ధ్యాస అంతా సినిమాలపై పెడుతున్నాను అని ఆయన ట్విట్ చేశారు. ఇప్పుడు ఇలా జరిగిందని బాధపడకండి. భవిష్యత్ లో అధికారం మనదే అని ఆయన కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు.