Friday, June 14, 2024
- Advertisement -

కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శల ‍హోరు

- Advertisement -

తెలుగుదేశం పార్టీ మహానాడు తిరుపతి పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. తొమ్మిది సంవత్సరాల తర్వాత తిరుపతిలో మహానాడు జరగడం ఇదే తొలిసారి. దీంతో తిరుపతి పట్టణమంతా పసుపు వర్ణంతో నిండిపోయింది. పట్టణమంతా హోర్డింగులు, ఫ్లెక్సీలు, పసుసు జెండాలు, తోరణాలతో నిండిపోయింది. తిరుపతి వచ్చిన యాత్రికులకు ఇది కొత్తగా అనిపించింది.

ఉదయం 10.15 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు సభా వేదికకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల మహిళా అధ్యక్షురాళ్లు శోభాహైమవతి, బండ్ర శోభారాణి బతుకమ్మలు, పూర్ణ కుంభాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కొబ్బయకాయ కొట్టారు.ఇక మహానాడు తొలి రోజు సమావేశంలో కొత్త తెలుగు రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర‌్శలు గుప్పించడానికే కేటాయించారు.

 ఈ సమావేశంలో ప్రసంగించిన నేతలంతా కెసిఆర్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడడం విశేషం. ముఖ్యంగా మిషన్ కాకతీయపై టిడిపి నేతలు విరుచుకుపడ్డారు. చెరువుల పూడికతీతలో భారీ అవినీతి జరుగుతోందని, ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో 22 శాతం ముడుపులకే ఖర్చు చేస్తున్నారన్నారన్నారు. సింగరేణి ఉద్యోగాలను సైతం అమ్ముకుంటున్నారని, టిఆర్ఎస్ నాయకులు, అదికారులు వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రభుత్వ పథకాలు మితిమీరిన అవినీతి అంటూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై టిడిపి నాయకులంతా ప్రసంగించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -