Saturday, May 18, 2024
- Advertisement -

రెస్టారెంట్ ద్వారా హీరో నితిన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!!

- Advertisement -
Nithin’s T- Grill restaurant Income

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర బిజినెస్ రంగాల్లోకి కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్, మహేష్, నితిన్ లు నిర్మాతలుగా మారి విజయాన్ని కూడా సాధించారు.

 కాగా నితిన్ మరో అడుగు ముందుకేసి ఇటీవల ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్లో ‘టి గ్రిల్’ పేరుతో ఈ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు.  డిఫరెంట్  యాంబియన్స్,  టేస్టీ ఫుడ్ వల్ల ఈ రెస్టారెంట్ చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయింది.

అలాగే చాలామంది సినీ సెలబ్రిటీస్ ఇప్పుడు నితిన్ రెస్టారెంట్ నే రెగ్యులర్ మీటింగ్ ప్లేస్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారట. అలాగే  మాదాపూర్ చుట్టూ ఉండే యూత్,  సాఫ్ట్ వేర్ పీపుల్ని కూడా నితిన్ టి గ్రిల్ లాగేస్తోందట. దీంతో నితిన్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందట. రోజుకి 75వేల నుండి లక్షరూపాయల దాకా లాభం వస్తోందని నితిన్ సన్నిహితులు చెబుతున్నారు. ఇటు సినిమాలతో అటు వ్యాపారంతో నితిన్ చాలా బిజీగా గడుపుతున్నాడని అంటున్నారు.  

{youtube}brENUrcXdBc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -