Tuesday, May 6, 2025
- Advertisement -

టమాట రైతుల కంటతడి!

- Advertisement -

ఏపీలో టమాట ధరలు అమాంతం పడిపోయాయి. స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి రావడంతో భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. కష్టపడి పండించిన పంటలకు ధర లేకపోవడంతో టమాట రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.

చిల్లర వ్యాపారులు మార్కెట్లో కిలో టమాటాను రూ.10 – రూ.20 మధ్య విక్రయిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రజల అవసరాలకు ఆయా రాష్ట్రాల టమాటాలు సరిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల వ్యాపారులు ఏపీకి వచ్చి కొనడం లేదు. ఏపీలో స్థానిక వ్యాపారులకు మాత్రమే టమాటాలను రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో ఏపీలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి.

దీంతో చాలా మంది రైతులు టమాటాలను కనీసం మార్కెట్లకు కూడా తీసుకుపోకుండా పొలాల వద్దే పారేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -