భగ్గుమంటున్న కూరగాయల ధరలు

- Advertisement -

ఏపీ వ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఏ కూరగాయలు కొనాలన్నా.. కేజీ 60 రూపాయల పైనే పలుకుతోంది. ఇక టమాట ధరలైతే ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్ ధరలు లాగే.. టమాట ధరలు కూడా సెంచరీ దాటి దూసుకెళ్తున్నాయి. అయితే.. టమాట ధరలు మాత్రం ఆల్‌టైం రికార్డును బ్రేక్ చేస్తున్నాయి.

టమాటో పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ పరిస్థితిలు గాడి తప్పుతున్నాయి. గతంలో ఉల్లి కన్నీరు పెట్టిస్తే ఈసారి టమాటో ఆ స్ధానాన్ని ఆక్రమించి.. సెంచరీ దిశగా పరుగులు తీస్తోంది. దీంతో కిలో టమాటో కొనాలంటే సామాన్యుడి కంట కన్నీరు వస్తోంది. రోజు రోజుకు టమాటో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా మదనపల్లి మార్కెట్ లో టమాటో ధర రికార్డ్ స్ధాయికి పలకడంతో టమాటో ధరాఘాతంతో విక్రయ దారులు ఆవేదన చేస్తున్నారు.

- Advertisement -

ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటో సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. అయితే.. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటో రెట్టింపు ధరలకు కారణంగాలుగా తెలుస్తోంది. దీంతో మార్కెట్‌లో టమాటో డిమాండ్ మరింత పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా నుంచి కొలుకుంటున్న ప్రజలపై పడుతున్న ధరల భారం నుంచి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

కరోనా కొత్త వేరియంట్…. కేంద్ర నిర్ణయమేంటి ?

పవన్ కళ్యాణ్ ఎక్కడ..? మౌనం ఎందుకు..?

తిరుపతిలో వింత ఘటన.. క్యూ కడుతున్న జనం

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -