రికార్డు స్థాయిలో కిలో టమోటా ధర.

- Advertisement -

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లె టమాటా మార్కెట్ లో ఇప్పటివరకూ కనీ విని ఎరుగని రీతిలో మొదటి రకం టమోటా కిలో 150 రూపాయలు పలకడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత రెండు నెలలుగా కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చిన టమోటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజులుగా అనూహ్యంగా పుంజుకుంది.

ఏకంగా 23 కేజీల క్రేటు 3600 రూపాయలు పలికింది. గత సంవత్సర కాలంగా అప్పులు చేసి పంట పండించినప్పకీ చాలా నష్టపోయామని ఇప్పడు ఈ ధరల వల్ల తమ అప్పులు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పతనమయినప్పుడు తమను ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదని పెరిగినప్పుడు మాత్రం ఆగమేఘాల మీద ధరలను నియంత్రించడానికి ప్రయత్నిస్తారని ఆవేశపడ్డారు.

- Advertisement -

ముఖ్యంగా వర్షాలకు అందరి పంట దెబ్బతిని పావు వంతుమాత్రమే పంట వస్తుండటం ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. యాపిల్ ధర 120 కాగా టమోటా ధర 150 ఉండటం సామాన్యులని నివ్వెరపరుస్తోంది. 500 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్న చోట 100 మెట్రిక్ టన్నులే వస్తోందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో కేజీ 20 అమ్మే టమాటా రేటు టమాటాల ధర ఇప్పుడు చుక్కలను తాకుతోంది.

కేంద్రం అందుకే దిగొస్తుందా?

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

అందరి దృష్టి ద్రావిడ్ పైనే..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -