Sunday, May 5, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ ను రాజకీయ నేతలు పట్టించుకోలేదా..?!

- Advertisement -

దక్షిణాది నుంచి హిందీ వైపు వెళ్లి అక్కడ కూడా తన గ్లామర్ తో ఒక రేంజ్ కు చేరుకొన్న నటి జయప్రద. బాలీవుడ్ లోని టాప్ స్టార్ల పక్కన నటిస్తూ టాప్ హీరోయిన్ గా నిలిచిన నేపథ్యం ఉంది ఆమెకు.

అలా బాలీవుడ్ లో సంపాదించుకొన్న గుర్తింపుతోనే ఎంచక్కా రాజకీయాల్లోకి వచ్చింది. మొదటగా ఏపీ నుంచి.. తర్వాత యూపీ నుంచి ఎంపీగా ఎన్నికైంది!

అలా కొంతకాలం రాజకీయాల్లో రాణించిన జయప్రదను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అంతగా పట్టించుకోవడం లేదు. తన సన్నిహితుడు అయిన అమర్ సింగ్ తో పాటు సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జయప్రద ను పట్టించుకొనే నాథుడు లేకుండా పోయాడు. ఎన్నికల ముందే ఈమె కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ లేదా బీజేపీలకు దగ్గరవుతుందని అందరూ అనుకొన్నారు. అయితే అవేవీ జరగలేదు.. జయప్రద ఎన్నికల్లో విజయం సాధించలేదు.
ప్రస్తుతానికి ఆమె ఖాళీగానే ఉంది. మరి ఎన్నికల తర్వాత మారిన సమీకరణాలను బట్టి చూసుకొంటే.. జయప్రదను పట్టించుకొనే నాథుడు లేకుండా పోయాడు! దీంతో ఈ హీరోయిన్ తిరిగి సినిమాల మీద దృష్టి సారించినట్టుగా ఉంది. రెండేళ్ల క్రితం  ఏదో సినిమాలో అతిధిపాత్రలో చేసిన జయప్రద.. ఇకపై పూర్తి స్థాయిలో నటిగా బిజీ అయ్యే ఉద్దేశంతోఉన్నట్టుగా తెలుస్తోంది. మరిసినిమాల్లో జయప్రద లేటెస్ట్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -