Monday, May 20, 2024
- Advertisement -

రాజ్యసభలో తెలుగు ఎంపీలు అలా మాట్లాడుకొన్నారు!

- Advertisement -

మూడు ప్రధాన పార్టీలకూ తెలుగు వారు ముఖ్యమైన రెప్రజెంటేటివ్స్ గా ఉన్నారు. అధికార భారతీయజనతా పార్టీలో వెంకయ్య నాయుడు మంత్రిగా.. ముఖ్యనేతగా చక్రం తిప్పుతుండగా… కాంగ్రెస్ పార్టీ తరపున వాయిస్ వినిపించే రాజ్యసభ ఎంపీల్లో రేణుకాచౌదరి ముఖ్యపాత్రలో ఉన్నారు. ఇక సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ కూడా తెలుగు వాడే!

వీళ్ల ముగ్గురికీ వాక్పటిమ ఉంది. తమ ప్రత్యర్థి రాజకీయ నేతలపై ఎదురుదాడి చేయగల సామర్థ్యం… తమ మాటలతో వారిని ఇరుకునపెట్టే వ్యూహచతురత ఉంది. మరి ఈ ముగ్గురు తెలుగు వాళ్లూ ఒక అంశం గురించి చర్చలో పాల్గొంటే.. ఇంకేముంది! రచ్చ రచ్చే!

 
తాజాగా అలాంటి చర్చే జరిగింది. ఈ ముగ్గురు తెలుగు వాళ్లూ చర్చలో పాల్గొన్నారు. తెలుగులో మాట్లాడుకొన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో వరసలను పెట్టుకొని ప్రసంగాలు చేశారు!
 
ముందుగా కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ వెంకయ్య మాట్లాడుతూ… “అమ్మా..” అని సంబోధించాడు. ఇందులో తప్పేమీ లేదని.. ఆ మాట ప్రేమాభిమానాలకు నిదర్శనం అని ఆయన చైర్ లో ఉన్న డిప్యూటీ చైర్మన్ కు వివరణ ఇచ్చాడు. అయితే రేణుక మాత్రం “నన్ను అమ్మా అని కాదు.. అక్క..” అని పిలవండి అని చెప్పుకొచ్చింది! ఆ విధంగా తను ఒక నాయకురాలిని అనే విషయాన్ని గుర్తించండి అని రేణుక చెప్పుకొచ్చిందనుకోవాలి.
 
వీరిద్దరి వాదన ఇలా ఉంటే.. సీతారం ఏచూరిని వెంకయ్య నాయుడు ‘అన్న’గా సంబోధించడం విశేషం. ఈయన కూడా తెలుగు వాడే కావడంతో వెంకయ్యకు ఈ అవకాశం దక్కింది. మరి మొత్తానికి రాజ్యసభలో బాగానే ఉన్నాయి తెలుగు ఎంపీల వరసల పిలుపులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -