ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ అంటూ ‘సన్నీ లియోన్’ పేరును ప్రకటించింది ఒక ఆంగ్ల జాతీయ వార్త పత్రిక. ఆన్ లైన్ లో పోల్ పెట్టి తాము ఎంపిక చేసిన డిజైరబుల్ వుమెన్ జాబితాలో ఆ పోర్నోస్టార్ తొలి స్థానంలో నిలిచింది అని ఆ మీడియా సంస్థ ప్రకటించుకొంది!
మరి ఇంతకన్నా వేరే ఎవరూ ఆ స్థానాన్ని సొంతం చేసుకోలేకపోయారా? సన్నీ లియోన్ కు ధాటి అయిన మహిళామణులు ఇండియాలో లేకుండా పోయారా? అనే పెద్ద సందేహం తలెత్తుతుంది ఇక్కడ! సన్నీలియోన్ ఇప్పుడిప్పుడే ఇండియన్స్ కు పరిచయం అయిన వ్యక్తి కాదు. ఇప్పటికే సన్నీ ఇండియాకు వచ్చి నాలుగైదేళ్లు గడిచాయి. అప్పటి నుంచి ఆమె గురించి వార్తలు వచ్చి.. వచ్చి ఆమె జనాలకు బోర్ కొట్టేసింది!
ఇక సన్నీ తెగింపు ఎలాంటిదో అందరికీ తెలిసిందే! బాలీవుడ్ లో సన్నీ లియోజన్ జర్నీ కూడా ఏమంత సక్సెస్ ఫుల్ గా లేదు. బ్లూ ఫిలిమ్స్ లో అద్భుతం గా నటించే ఆమె.. అసలు సినిమాల్లో అస్సలు నటించలేదనే విషయం స్పష్టం అయ్యింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆమె నెటిజన్ల మద్దతు పొందింది.. అంటే నమ్మడం చాలా కష్టం.
అయినా.. ఒక పోర్నోస్టార్ ను ఇండియన్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా ప్రకటించి.. ఆ మీడియా ఇండియన్ టేస్ట్ మీదనే చెడు ముద్ర వేసిందేమో!
