మనం ఏదైన హోటల్‌కు వెళ్లితే సర్వర్‌కు ఎంత టిప్ ఇస్తాం మహ అయితే 100 రూపాయిలు ఇస్తాం.బాగా డబ్బు ఉన్న వాళ్లు అయితే 500 ఇస్తారు.కాని ఓ సర్వర్‌కు ఏకాంగా 7.38 లక్షలు టిప్ ఇచ్చిన ఘటన నార్త్ కరోలినాలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఓ హోటల్ లో అలియానా కస్టర్ అనే యువతి వెయిట్రెస్ గా పనిచేస్తోంది. ఆ హోటల్ కు వచ్చిన ఓ కస్టమర్ మంచినీరు కావాలని కోరగా, ఆమె నీరిచ్చింది. అవి తాగిన అతను మరో గ్లాస్ కావాలని అనడంతో, అంతే వినమ్రంగా మరో గ్లాస్ నీటిని ఇచ్చింది.
ఆపై హోటల్ నుంచి వెళ్లిపోయిన అతను, “రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు” అని ఓ కాగితంపై రాసి, టిప్ ను అక్కడ పెట్టి వెళ్లాడు. దాన్ని చూసిన ఆమె సంభమాశ్చర్యాల్లో పడి, తేరుకోకముందే, మరోసారి వచ్చిన అతను, ఆమెకు ఓ హగ్ ఇచ్చి వెళ్లాడు. ఆ కస్టమర్ యూట్యూబ్ లో దాదాపు 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా, ఇప్పుడు ఆనందంలో ఎగిరి గంతేస్తోంది.
