Saturday, May 4, 2024
- Advertisement -

ఏక్ష‌ణ‌మైనా యుద్ధం ప్రారంభం…

- Advertisement -
North Korea Kim Jong un warned to United States of America Donald Trump

పెద్ద‌న్న అమెరికాతో అణుయుద్ధానికి కాలు దువ్వుతోంది ఉత్త‌ర కొరియా. మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేర‌డంతో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఏక్ష‌ణంలో నైనా యుద్ధం మొద‌ల‌వుతుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

దీంతో అంత‌ర్జాతీయంగా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అమెరికాపై హెచ్చరికలు చేస్తూ ఉత్త‌ర కొరియా మరోసారి దుస్సాహసానికిపాల్పడింది. అణుబాంబుతో దాడిచేస్తే అమెరికాలో కోట్ల మంది ప్రజలు మరణిస్తారని తాజాగా హెచ్చరికలు చేసింది.
వీట‌న్నింటికి బ‌లం చేకూరుస్తూ తాజాగా ఉత్తరకొరియా అధికార ప్రతినిధి రోడాంగ్‌ సిన్మన్‌ ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాపై ఏ క్షణంలోనైనా అణుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉత్త‌ర కొరియా జ‌లాల్లో ఉన్న అమెరికా యుద్ధ‌నైక‌ల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని ….ఇకపై ఒక్క అడుగు ముందుకేసినా చూస్తూ ఊరుకునేది లేదని.. అమెరికాలోని ప్రధాన భాగాల్ని బూడిద కుప్పలా చేస్తామంటూ చెప్పిన మాటలు కొత్త వేడిని పుట్టేలా చేశాయి.
మొదట్లో కిమ్ విషయంలో కాస్తంత కటువుగానే సమాధానం చెప్పిన ట్రంప్.. తర్వాతి కాలంలో మాత్రం త‌న స్వ‌రంలో మార్పువ‌చ్చింది.ఒక దశలో ఇరు దేశాల మధ్య చర్చల ద్వారా ఇష్యూలను క్లోజ్ చేసుకోవాలన్న మాటను అమెరికా చెప్పింది. అయినప్పటికీ.. కిమ్ సర్కారు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో చర్చల స్థానే మాటలు తూటాల్లా పేలుతున్నాయి. తాజాగా యూకేలో ఉత్తర కొరియా బ్రాండ్ అంబాసిడర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇటీవల జరిపిన డ్రిల్‌ యుద్ధానికి ప్రారంభం లాంటిది. అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది. యుద్ధం జరిగితే.. కోట్ల మంది అమెరికన్లు అణుదాడిలో మరణిస్తారు. ఆ దేశ స్వరూపమే మారిపోతుంది. అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్‌ కూడా దొరకదు. ఇకనైనా అమెరికా.. దక్షిణకొరియాలో ఉన్న వారి భద్రత గురించి ఆలోచించడం మాని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.’ అని ప్రకటనలో పేర్కొంది.అమెరికాలో ప్రాణాలతో మిగిలిన వారికి కనీసం షెల్టర్‌ కూడా దొరకదు. ఇకనైనా అమెరికా.. దక్షిణకొరియాలో ఉన్న వారి భద్రత గురించి ఆలోచించడం మాని, తమ దేశంలోని ప్రజలను ఎలా కాపాడుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.’ అని ప్రకటనలో పేర్కొంది.
ఎప్పుడు ఏంజ‌రుగుతుందోన‌ని అంత‌ర్జాతీయంగా అర్థం కాని పరిస్థితి నెలకొంది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా తాజాగా ఎన్నికైన మూన్.. అమెరికా.. ఉత్తర కొరియాల మధ్య ఉద్రిక్తతల్ని తొలగించే బాధ్యతను తాను తీసుకున్నట్లుగా చెప్పిన తర్వాత.. ఈ స్థాయిలో ఉత్తర కొరియా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. రోజురోజుకీ.. ఈ రెండు దేశాల సంబంధాలుఅంతకంతకూ దిగజారుతున్నాయి.రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల‌పై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -