Sunday, April 28, 2024
- Advertisement -

ఐపీఎల్ తెలుగు కామెంటరీ లో..!

- Advertisement -

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ప్రాంతీయ భాష కామెంటరీలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇన్ని రోజులూ ఇంగ్లిష్ ..

హిందీ భాషల్లో మాత్రమే నడిచిన రన్నింగ్ కామెంటరీ ఇప్పుడు తెలుగు, తమిళ, బెంగాలీ వంటి భాషల్లో కూడా వస్తోంది. ఈ లీగ్ ప్రసార హక్కులు కలిగి ఉన్న సెట్ మ్యాక్స్ వారు ఈ ఏర్పాట్లు చేశారు. తమ నెట్ వర్క్ లో ఉన్న ఇతర ఛానళ్లను ఉపయోగించుకొంటూ విభిన్న భాషల్లో కామెంటరీని అందిస్తున్నారు.

సెట్ మ్యాక్స్ లో ప్రముఖంగా హిందీ  కామెంటరీ వస్తోంది. గతంలో ఇంగ్లిష్ కామెంటరీని మాత్రమే అందించిన ఈ చానల్ లో ఇప్పుడు హిందీ కామెంటరీని పరిమితం చేశారు.  ఇక తెలుగు కోసం సోనీ కిక్స్ అనే చానల్ ను ఏర్పాటు చేశారు.  దీంట్లో లైవ్ కామెంటరీ తెలుగులో వస్తుంది. 

అలాగే, బెంగాలీ, తమిళ భాషల కోసం కూడా సోనీ నెట్ వర్క్ చానళ్లను ఏర్పాటు చేసింది. మరి ఇది వరకూ కూడా ఇలాంటిప్రయత్నాలు జరిగాయి. అవి అంత విజయవంతం అయిన దాఖలాలు లేవు.  మరి సోనీ నెట్ వర్క్ ఈ విషయంలో ఏమేరకు ఆకట్టుకొంటుందో చూడాలి! 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -