Sunday, May 12, 2024
- Advertisement -

తొలిసారి అలాంటి సినిమా చేయబోతున్న ఎన్టీఆర్!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఇంత వరకూ ఎప్పుడూ రీమేక్ ల జోలికి వెళ్లలేదు. తెలుగులో చాలా మంది హీరోలు రీమేక్ సబ్జెక్టుల మీద ఆసక్తి చూపిస్తుంటారు.

పక్క భాషల్లో విడుదలై హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ మాత్రం అందుకు భిన్నం. తీస్తే డైరెక్ట్ సినిమాలు తీయడమే తప్ప.. రీమేక్ సబ్జెక్టులపై ఆసక్తి చూపలేదు.

అయితే తొలిసారి ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడు. తమిళంలో విడుదలై హిట్టైన సినిమాను తెలుగులో తీయబోతున్నాడు. తమిళంలో మురగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొంది హిట్ అయిన ‘కత్తి’ సినిమాను జూనియర్ రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలో ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలుగు సినిమాకు కూడా మురగదాసే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ద్విపాత్రాభినయం:
ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో హీరో విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఈ సినిమా రీమేక్ ద్వారా మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని అనుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కు డబుల్ రోల్స్ చేసిన చరిత్ర ఉంది. అదుర్స్ వంటి హిట్ సినిమాలో కూడా జూనియర్ డబుల్ రోల్ లోనే కనిపిస్తాడు. ప్రస్తుతం  సుకుమార్ దర్శకత్వంలోని సినిమా పనిలో ఉన్న ఎన్టీఆర్ ఇది పూర్తయిన తర్వాత కత్తి రీమేక్ చేయనున్నాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -