Thursday, May 2, 2024
- Advertisement -

రేప్ కేసుపై గడ్కరీ వివాదాస్పద వ్యాఖ్యలు!

- Advertisement -

పశ్చిమ బెంగాల్ లో అత్యాచారానికి గురైన నన్ కేసులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వివాదస్పద వ్యాఖ్యానాలు చేశారు. నన్ పై దారుణానికి ఒడిగట్టిన వారి మతాన్ని ప్రస్తావించి వివాదాన్ని సృష్టించాడు.

వృద్ధురాలు అయిన నన్ పై దారుణానికి ఒడిగట్టింది ఇద్దరు మస్లిం యువకులు అని.. వారు బoగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారని.. గడ్కరీ వ్యాఖ్యానించాడు. మరి నీఛానికి పాల్పడ్డ వారు ఎవరు అనేది అక్కడ సమస్య కాదు. దీంతో దోషులు అని గడ్కరీ వ్యాఖ్యానించడం వివాదం అవుతోంది.

ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అత్యాచారానికి పాల్పడ్డవారికీ మతానికి ముడిపెడుతూ మాట్లాడటం ఏమిటి? అంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిపై విమర్శలు చేసింది. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టం.. వీటిని అరికట్టాలి.. దోషులకు శిక్ష పడేలా చేయాలి.. అయితే మంత్రి మాత్రం వారి మతం గురించి మాట్లాడుతున్నాడు.. ఇందులో అర్థం ఏముంది? అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు గడ్కరీ తీరును ఖండిస్తున్నారు.

ఇటీవల బెంగాల్ పర్యటనలో భాగంగా గడ్కరీ ఈ వ్యాఖ్యానాలు చేశారు. అనవసరంగా వివాదంలో ఇరుక్కొన్నారు. బెంగాల్ లో కొన్ని రోజుల క్రితం నన్ పై అత్యాచారం జరిగింది. ఆ ఘాతుకానికి ఒడిగట్టిన వారిని వెంటనే పట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ప్రత్యేకంగా దేశాలు జారీ చేశారు. తద్వారా ఈ కేసు తీవ్రత పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -