Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీవీ చౌదరి గారు అల్లుడుకి కట్నం ఏంతో తెలుసా..?

- Advertisement -

ఆ మధ్య గాలి జనార్దన్ రెడ్డి.. తన కుమార్తె పెళ్లి ఏ రెంజ్ లో చేశారో అందరికి తెలిసిందే. తాజాగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి తన కూతురు పెళ్లిని భారీగా చేయబోతున్నారు. ఒక్క శుభలేఖకు లక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తున్నారట.

శంషాబాద్ జీఎంఆర్ లో ఈ నెల 23 వ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పెళ్లి చాలా ఘనంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినీ సెట్టింగ్స్ ను మించిన పెళ్లి మండపం, డాబు, దర్పం ఉట్టిపడేలా సకల మర్యాదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, దేశ రాజకీయ ప్రముఖులు, దేశ విదేశాల నుంచి ప్రముఖులను రాబోతున్నారు. ఒక్కో శుభలేఖకు లక్షన్నర ఖర్చుతో 300 శుభలేఖలను ముద్రించారట. కాబోయే అల్లుడికి రూ.50 కోట్ల విలువ చేసే హెలికాప్టర్ ను గిఫ్ట్ గా ఇస్తున్నారట. గాలి జనార్థ‌న్‌రెడ్డి కుమార్తె పెళ్లికి కాస్త అటూ ఇటూగానే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో ఓ భారీ వివాహంగా ఎన్టీవీ చౌదరి కుమార్తె పెళ్లి జరుగబోతోంది.

ఎన్టీవీ చౌద‌రి కుమార్తె పెళ్లి ఓ వ్యాపార కుటుంబానికి చెందిన వరుడితో జ‌ర‌గ‌నుంది. ఇక అల్లుడికి చౌద‌రి ఇచ్చే క‌ట్నం ఎన్ని కోట్లో కూడా లెక్కే లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విమానం ఇచ్చే స్థాయి పెళ్లి అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటారో కదా. మ‌రి ఈ కాస్ట్‌లీ పెళ్లికి సంబంధించి ఇంకెన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయో ముందు ముందు చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -