Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీవల్లీ మూవీ రివ్యూ

- Advertisement -

రాజమౌళి తెరకెక్కించి దాదాపు అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్రప్రసాదే కథలు అందిస్తుంటారు. ఆయన అందించిన కథలు తెరమీదకు వచ్చేసరికి అద్భుతంగా తెరకెక్కాయి. చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజా ఆయన కథ అందించిన బాహుబలి ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఇక ఆయన తాజాగా ఓ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేఉ శ్రీవల్లీ. ఓ విభిన్న కథకు థ్రిల్లర్ అంశాన్ని అందించి.. ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రీవల్లీగా నేహా నటన బాగుంది. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుణ్ది. కానీ స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది. శ్రీవల్లీ అనే యువతిపై ఓ న్యూరో సర్జన్ బ్రెయిన్ ఎక్స్పరిమెంట్ చేయాలనే ప్రయత్నంలో.. ఆమె భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలోని వ్యత్యాసాన్ని మరిచిపోతుంది. ఏది నిజం, ఏది మాయ అనేది అర్థం చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది. దీని వల్ల ఆమె ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది.

అయ్తే ఆమె ఆ పెద్ద సమస్య నుంచి ఎలా బయటపడింది ఏనేది కథ. విజయేంద్ర ప్రసాద్ రచయిత గా రాణించగలిగారు.. కానీ దర్శకత్వంలో అదే స్థాయిలో రాణించలేకపోయారు. శ్రీవల్లీని అనుకున్న విధనంలో తెరకెక్కించడంలో విఫలం అయ్యారు. చిన్న సినిమా తెరకెక్కిన ఈ సినిమాలోని గ్రాఫిక్స్ పెద్దగా బాలేవు. ఓ సినిమా టైం ఉన్నప్పుడు చూసే సినిమా ఇది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -