Wednesday, May 1, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌…

- Advertisement -

వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇవాళ ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొద‌టి మ్యాచ్‌లోనె సౌతాఫ్రియా జ‌ట్టుపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీదుంది. మ‌రో వైపు పాక్ త‌న తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఓడిపోయింది. ఇవాళ్టి మ్యాచ్‌కు ఇంగ్లండ్ జ‌ట్టులో ఒక మార్పు జ‌రిగింది. లియాం ప్లంకెట్ స్థానంలో మార్క్ వుడ్ వ‌చ్చాడు. పాక్ జ‌ట్టులో రెండు మార్పులు జ‌రిగాయి. ఇమాద్‌, హారిస్ స్థానంలో ఆసిఫ్ అలీ, షోయెబ్ మాలిక్ వ‌చ్చారు.

దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గి తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలోని ఇంగ్లాండ్ భావిస్తోంది.

జట్ల వివరాలు:
ఇంగ్లాండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్ స్టో, జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, జోఫ్రా అర్చర్, అదిల్ రషీద్, మార్క్ ఉడ్

పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్(వికెట్ కీపర్/కెప్టెన్), మొహమ్మద్ హఫీజ్, అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, వాహబ్ రియాజ్, మొహ్మద్ ఆమిర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -