వైసీపీ అధినేత జగన్‌కు మొదట్లోనె భారీ బిగ్‌షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా జగన్ ప్రజాసంకల్పం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. తాజాగా అంతర్జాతీయ నల్లధన కుబేరుల జాబితాలో జగన్ పేరుఉండటం సంచలనంగా మారింది. ఇది పాదయాత్రపై ప్రభావాన్ని చూపె అవకాశాంలేకపోలేదు. దీన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మలుచుకోనున్నాయి.
ఆయనతో పాటు మన దేశంలోని పలువురు పెద్దల పేర్లను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) తన ‘ప్యారడైజ్ పేపర్స్’ ద్వారా బయటపెట్టింది. ప్యారడైజ్ పేపర్లపై ఇన్వెస్టిగేషన్ జరిపిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ వీటిపై వరుస కథనాలను ప్రచురించనున్నట్టు ప్రకటించింది. ఈ బిగ్ డేటా ప్రస్తుతం భారత రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ‘యాంటీ బ్లాక్ మనీ డే’ను నిర్వహించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైన తరుణంటో ఈ బిగ్ డేటా విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.
బెర్ముడాస్ అప్లీబీ, సింగపూర్స్ ఆసియాసిటీలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 19 నల్లధన స్వర్గధామాల్లో తమ నల్లధనాన్ని దాచుకునేందుకు ప్రపంచ కుబేరులు, శక్తిమంతులకు సహకారం అందిస్తున్నాయి. వీటి సహాయంతో వీరంతా తమ నల్లధనాన్ని విదేశీ సంస్థల్లోకి తరలిస్తున్నారు.
ప్యారడైజ్ పేపర్స్ దాదాపు 13.4 మిలియన్ డాక్యుమెంట్లను బయటపెట్టింది. వీటిలో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉండటం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇచ్చే అంశమేనని చెప్పాలి. ఈ అంశాన్ని టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకోబోతున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు టీడీపీ నేతలు ఈ అంశంపై మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు గుప్పించారు. మరి జగన్ అధికారపార్టీ విమర్శలను ఎలా ఎదుర్కొంటారొ చూడాలి.