Monday, April 29, 2024
- Advertisement -

జియోకు పోటీగా దూసుకొస్తున్న ప‌తంజ‌లి సిమ్ కార్డులు..

- Advertisement -

టెలికాం రంగంలో ప్రత్యర్థి కంపెనీలకు సవాల్ విసిరి, దూసుకుపోతున్న జియో తీవ్రమైన పోటీని ఎదుర్కోబోతోంది. ఫుడ్, ఆయుర్వేద్‌ మెడిసిన్, కాస్మటిక్స్, హోమ్‌ కేర్, పర్సనల్‌ కేర్‌ విభాగాల్లో ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న పతంజలి తాజాగా టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘స్వదేశీ సమృద్ధి’ పేరిట సిమ్‌లను కూడా బాబా రాందేవ్‌ మార్కెట్‌లోకి విడుదల చేశారు. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో జత కట్టిన రాందేవ్‌, ఈ పతంజలి సిమ్‌ కార్డులను తీసుకొచ్చారు.

తొలి దశలో ఈ సిమ్ కార్డులు కేవలం పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

సిమ్ కార్డుల ప్లాన్ ల వివరాలు ఇవే!

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 144 ప్లాన్:
నెల రోజుల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్. ఆలిండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 792 స్పెషల్ ప్లాన్ ఓచర్:
6 నెలల వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్. ఆలిండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

పతంజలి-బీఎస్ఎన్ఎల్ రూ. 1584 స్పెషల్ ప్లాన్ ఓచర్:
ఒక సంవత్సరం వాలిడిటీ. అపరిమిత వాయిస్ కాల్స్, ఆల్ ఇండియా రోమింగ్. రోజుకు 2 జీబీ డేటా. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -