Thursday, May 16, 2024
- Advertisement -

వాట్స‌ప్‌కు పోటీగా ప‌తంజ‌లి కింభో యాప్‌…

- Advertisement -

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సాప్‌కు పతంజలి సంస్థ షాకిచ్చింది. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌కు తిరుగులేదు. కానీ ప‌తంజ‌లి నుంచి వ‌స్తున్న యాప్ వాట్స‌ప్‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది. కింభో పేరిట యాప్‌ రూపకల్పన చేసి ఆవిష్కరించింది

యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్ మాట్లాడుతుంది. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇప్ప‌టికే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసింది. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించింది.

అంతేకాదు పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -