Friday, May 3, 2024
- Advertisement -

పవన్‌కు జ్వరం..

- Advertisement -

పవర్ స్టార్ జనసేనాని మళ్ళీ జర్రమొచ్చింది… దాంతోబాటు ఇంకేదో శ్వాసకోశ సమస్య ఉండడంతో తరచూ ఎలర్జీ వస్తోంది…. అందుకే ఎవరూ ఆయనమీద పూలు చల్లొద్దు…. దూరం నుంచి దండం పెట్టుకుని పరవసించాలి… షేక్ హ్యాండ్స్ గట్రా అసలే కుదరదు…అంటూ జనసేన పార్టీ క్యాడర్ కు ఒక సూచన చేసింది… రెండ్రోజులు జనంలో తిరిగితే…ఎండల్లో కదలాడితే సుకుమారుడికి ఊష్టం వచ్చేస్తుంది..

ఇలాంటి అయన సీఎం వైయస్ జగన్ మీద జరిగిన రాళ్ల దాడిని గులకరాయి అని ఎగతాళి చేస్తారు… జగన్ మోహన్ రెడ్డికి కత్తితో గాయపర్చినా ఫర్లేదు …దాన్ని కూడా అవహేళన చేస్తారు…. సినిమాల్లో వందలమందిని ఎగరేసి కొట్టే పవన్ ….అదే పవర్ స్టార్…సభల్లో మాత్రం తమను బ్లేడ్లతో కోస్తున్నారని చాడీలు చెబుతారు… చిన్న ఫీవర్ వస్తే ఏకంగా వారం రోజులు రెస్ట్ అంటూ హైద్రాబాదు వెళ్ళిపోతారు..అలాంటి ఆయనకు రాజకీయాలు అవసరమా ? ఆయన్ను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లు తగలేసుకుంటున్నాం… అని జనసైనికులు… కార్యకర్తలు లోలోన కుమిలిపోతున్నారు… చేతలు గుమ్మం దాటలేవు కానీ మాటలు కోటలు దాటుతున్నాయి…అని క్యాడర్ సైతం సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -