Friday, May 3, 2024
- Advertisement -

శ్రీకాళహస్తిలో గెలుపెవరిదో?

- Advertisement -

దక్షిణ కాశీగా పేరు పొందిన పుణ్యక్షేత్రం శ్రీకాళ హస్తి. పుణ్యక్షేత్రమే కాదు రాజకీయంగానూ ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ ఆరుసార్లు విజయం సాధించగా కాంగ్రెస్ రెండుసార్లు,గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ తరపున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఐదు సార్లు గెలిచి సత్తాచాటారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట, తొట్టంబేడు మండలాలు ఉన్నాయి. బొజ్జల మరణం తర్వాత ఆయన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా ఈసారి మధుసూదన్ రెడ్డితో తలపడుతున్నారు సుధీర్.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మధుసూదన్…నియోజకవర్గంలో సత్తాచాటారు. కరోనా సమయంలో సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక ముద్ర వేశారు.జగన్ సంక్షేమ పథకాలకు తోడు తన సేవా కార్యక్రమాలే తన గెలుపుకు బాట వేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రికి నియోజకవర్గంలో ఉన్న పట్టు, తాము చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా శ్రీకాళహస్తిలో ఇద్దరు రెడ్ల మధ్య జరుగుతున్న పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -