పవన్ కళ్యాణ్ కి సంపూ సపోర్ట్

పవన్ ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని త్వరలో కాకినాడ నుండి శ్రీకారం చుట్టనున్నారు. శివాజీ పవన్ కి మద్దతు తెలుపడం కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ అంశంపై తాను కూడా పోరాడతానంటూ మరో హీరో ముందుకు కదిలాడు.

అతనే సంపూర్ణేష్ బాబు. స్వతహాగా తెలంగాణాలో పుట్టి పెరిగిన సంపూ పరాయి రాష్ట్రానికి మంచి జరగడం కోసం పోరాటానికి సిద్ధంకావడం విశేషం. పవన్ స్పీచ్ తరువాతే ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో తెలిసిందని తన శక్తికి తగ్గట్టు పోరాడతానని తెలిపాడు. ప్రత్యేక రాష్ట్ర సమయంలో స్పందించిన సినీ పరిశ్రమ ఇప్పుడు కూడా స్పందించాలని భావించాడు. ఎందుకంటే మనం ఈ పొజిషన్ లో వుండడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులు కూడా కారణమని గుర్తుచేశాడు..

{YOUTUBE}79l8ut_WZLU{/YOUTUBE}

 

Related

  1. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం ఆసక్తిగా చూసిన చిరంజీవి
  2. తిరుపతి లో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ స్పీచ్
  3. నా కులం తో నాకు సంబంధం లేదు – హీరో శివాజీ
  4. టెంపరరీ ప్రత్యేక హోదా ?
  5. ముఖ్యమంత్రి .. పవన్ కళ్యాణ్ .. సీఎం పవర్ స్టార్