Saturday, May 11, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ రివ్యూ…!

- Advertisement -

నన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్ ల తరవాత ఎన్టీఆర్ నుంచి ఒస్తున్న సినిమా అవ్వడం తో జనత గ్యారేజ్ మీద జనాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయ్. శ్రీమంతుడు లో మహేష్ ని చాలా డిఫరెంట్ గా చూపించిన కొరటాల శివ అదే ఊపులో చాలా పెద్ద రికార్డులు కొట్టేసాడు. నాన్ బాహుబలి రికార్డులు అన్నీ ప్రస్తుతం శ్రీమంతుడు ఖాతా లోనే ఉన్నాయి అంటే కొరటాల రైటర్ సంగతి అర్ధం చేసుకోవచ్చు. అలాంటి కొరటాల తో ఎన్టీఆర్ ఎంత పెద్ద హిట్ కొడతాడో అని అందరూ ఎదురు చూసిన వేళ ఎలాంటి అవుట్ పుట్ ఒచ్చిందో చూద్దాం.

స్టోరీ మరియూ పాజిటివ్ లు :

స్టోరీ : సత్యం – మోహన్ లాల్ మంచికి ప్రాణం ఇస్తాడు .. ఊరినుంచి హైదరాబాద్ చేరుకొని జనత గ్యారేజ్ పెట్టి బైక్ లు రిపైర్ లు చేస్తూ ఉండే ఆయనకి జనాలు అంటే చాలా ఇష్టం .. వారికేమైనా నేనున్నా అంటూ తన బృందం తో కలిసి నుంచోవడం అతని సహజ గుణం. జనతా గ్యారేజ్ సభ్యులు మొదట ఒకరిద్దరిని కాపాడడానికి వెళ్లి ఆ తరవాత వేలాదిమందికి దిక్కు అవుతారు. ఎంతగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా సమావేశం ఏర్పాటు చేసినాప్పుడు జనత గ్యారేజ్ యొక్క సలహా కూడా తీసుకునేంతగా. అలాంటి సత్యం తన తమ్ముడునీ , మరదలినీ ఊహించని శత్రువుల వలన కోల్పోతాడు. వారిద్దరి సంతానం అయిన బాబు ని తన మరదలి అన్నగారికి అప్పజెప్పి ఆ బాబుని జనత గ్యారేజ్ నీడ కూడా పడకుండా పెంచమని పంపించేస్తాడు ఇదంతా 1980  లో జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తరవాత ఆ బాబు ఎన్టీఆర్ గా మారి తిరిగి ముంబై నుంచి హైదరాబాద్ ఒచ్చి జనత గ్యారేజ్ తో ఎలా కలిసాడు అనేది సినిమా లో మిగిలిన స్టోరీ. ఎన్టీఆర్ ఈ సినిమాకి చాలా పెద్ద పాజిటివ్ పాయింట్ గా నిలిచాడు. సినిమా ఆసాంతం నటన, ఫైట్ లూ డాన్స్ లతో మాస్ , క్లాస్ ప్రేక్షకులకి మంచి అనుభూతి ఇచ్చాడు. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ లో సరిగ్గా సరిపోయాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాకి మంచి బ్రేక్ ఇవ్వగా.. రాజీవ్ కనకాల ఎపిసోడ్ మాత్రం చాలా పెద్ద హై లైట్ అయ్యింది. ఇంటర్వెల్  తరవాత వచ్చే ఈ ఎపిసోడ్ తరవాత జనతా గ్యారేజ్ సాంగ్ మొదలు అవుతుంది. ఆ దేబ్బతో సినిమా ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది అసలు ..

నెగెటివ్ లు :

కథ చాలా భారీది ఎంచుకున్న కొరటాల శివ కథనం విషయం లో తడపడ్డాడు. మొదట బాగానే కనబరచిన ఆసక్తి సెకండ్ హాఫ్ లో పిచ్చి పిచ్చిగా అయిపొయింది. కథ ఒకవైపు వెళుతూ ఉంటె ఫామిలీ ఎమోషన్ లు పెట్టి , చీఫ్ మినిస్టర్ పదవి గోల అంటూ కొత్త ట్రాక్ ని నడిపాడు శివ అది జనాలకి అస్సలు కనక్ట్ అవ్వదు. అదే టైం లో కాజల్ ఐటం సాంగ్ ఒకటి విసుగు తెప్పిస్తున్నట్టు ఉంటుంది. సమంత , నిత్య మీనన్ లకి అసలు సినిమాలో ప్లేస్ లేనే లేదు. మినిమం కూడా వారి పాత్రలకి సరైన న్యాయం చెయ్యలేదు. నిత్య మీనన్ క్యారెక్టర్ అయితే ఎందుకు పెట్టారో కూడా ఎవ్వరికీ తెలీదు. అంత మంచి రైటర్ , డైరెక్టర్ అయిన కొరటాల శివ ఎన్టీఆర్ జనత గ్యారేజ్ లో జాయిన్ అవ్వడం కోసం ఒక మంచి సీన్ , కారణం పెట్టకపోవడం తో ఎన్టీఆర్ జనత గ్యారేజ్ కోసం ఏం చేసినా కూడా ఇంత హడావిడి ఎందుకు ? అనిపిస్తూ ఉంటుంది. అసలు ముక్కు మొహం తెలియని మోహన్ లాల్ అతని బృందం తో ఎన్టీఆర్ ఎందుకు చేతులు కలిపాడు అనేదానికి సమాధానమే లేదు. 

మొత్తంగా :

మొత్తంగా చూస్తే అనుకున్న అంచనాలని ఎక్కడా అందుకోలేక చతికిల పడింది జనత గ్యారేజ్ సినిమా.  మంచి కథని ఎంచుకున్న శివ దాన్ని ప్రెజెంట్ చెయ్యడం లో 80% సక్సెస్ అయ్యి 20% పాస్ అయ్యాడు. పెద్ద కాన్వాస్ మీద కథ చెప్పల్సినప్పుడు క్లారిటీ తో పాటు లాజిక్ చాలా అవసరం అది కొరవడింది ఈ సినిమాలో. ఎన్టీఆర్ నటన కోసం ఒక్కసారి చూడచ్చు అంతే.

{YOUTUBE}ruUqr5IAG84{/YOUTUBE}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -