రాజకీయ నాయకులు.. అధికారంలో ఉన్నపుడే మామూలుగా ప్రజా వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త డిఫరెంట్ కదా. ప్రజల విషయంలో ఆయన నడుచుకునూ తీరు మిగతా రాజకీయ నాయకుల కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది.
ఎందుకంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయంగా కష్టం వచ్చిన సమయంలోనే జనంలోకి వెళ్లడం.. ఏదో ఒక హంగామా చేసి అందరి దృష్టి మరల్చడం.. తప్పు జరిగితే పాలకులను ప్రశ్నిస్తానంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడం పవన్ కు అలవాటని చాలా మంది అంటారు. ఆ మాటకొస్తే.. పవన్ రాజకీయాలు కూడా దాదాపు అలానే ఉంటాయి.
ఈ విషయం చాలా రోజులకు గానీ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అర్థమైనట్టు లేదు. ఎందుకంటే.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా.. ఇప్పటివరకూ బాబు సర్కార్ పెద్దగా నియామకాలు చేసింది లేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే అయినా.. నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా బాబుపై ఉంది.
మరోవైపు బాబు హామీలకు పూచీ తనదన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూ ఈ విషయంలో బాబు కంటే కాస్త ఎక్కువే బాధ్యత ఉంది. ఇదే విషయాన్ని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగుల ఐక్య వేదిక ఎలుగెత్తుతోంది. తమ వయసు మీద పడుతున్నా.. ప్రభుత్వ ఉద్యోగాలను నోచుకోలేకపోతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టకాలంలో ఉన్న తమకు.. పవన్ కళ్యాణ్ అండగా ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నారు. కానీ.. ఇప్పటివరకు తమ తరఫున పవన ఎందుకు మాట్లాడడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం నోటిఫికేషన్లు వేయకుండా ఇలాగే వ్యవహరిస్తే.. తమ జీవితాలు ఇబ్బందుల్లో పడతాయని ఆవేదన చెందుతున్నారు. వీరి బాధ.. చంద్రబాబుకు ఎప్పుడు అర్థమవుతుందో.. ఆయనకు అండగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు వినిపిస్తోందో!
