Friday, April 26, 2024
- Advertisement -

‘లోఫర్ ‘ మూవీ రివ్యూ

- Advertisement -

ఇండస్ట్రీ లో పూరీ జగన్నాథ్ కి సంబంధించి ప్రత్యేక ఫాన్ బేస్ ఉంది. ఒక హీరోకి ఉన్నట్టుగా సేపెరేట్ ఫాలోయింగ్ కూడా పూరీ జగన్నాథ్ కి ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యకర విషయం కూడా. టెంపర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి జ్యోతి లక్ష్మి తో మళ్ళీ ఫార్మ్ ని కోల్పోయాడు ఆయన. ఇప్పుడు లోఫర్ సినిమా తో మళ్ళీ హిట్ కొట్టడం కోసం నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ తో సినిమా తీసాడు .. ఆ సినిమా ఫలితం ఎలా ఉందొ చూద్దాం.

పాజిటివ్ లు :

భార్య (రేవతి) ని మోసం చేసి పెళ్లి చేసుకున్న భర్త(పోసాని)ఆమె డబ్బున్న వ్యక్తి కావడం తో ఆమె ఆస్తి మీద కన్నేస్తాడు. ఆస్తి విషయంలో అతనికి రూపాయి కూడా ఇవ్వను అని చెప్పి ఆమె మొండికి వెయ్యడంతో వారిద్దరికీ పుట్టిన కొడుకుని ఎత్తుకుని జోద్ పూర్ పారిపోతాడు. తన కొడుకుని ఒక పిక్ పాకెట‌ర్ గా చేస్తాడు . ఆ కొడుకే రాజా (వరుణ్ తేజ్).తన త‌ల్లి చిన్న‌త‌నంలోనే చ‌నిపోయింద‌ని న‌మ్మే రాజా పూర్తిగా సెల్ఫిష్ మెంటాలిటీతో ఎదుగుతాడు. అదే రీతిలో మౌని అనే ముద్దుపేరుతో పారిజాతం (దిశా ప‌ఠానీ) కూడా జోధ్ పూర్ చేరుకుంటుంది. రాజా కు మౌని పరిచయం అవుతుంది ఆ పరిచయం కొన్ని రోజులకు ప్రేమగా మారుతుంది. అయితే పారిజాతం రాజా తల్లి రేవతికి అంతకు ముందే పరిచయం ఉంటుంది. అసలు  పారిజాతం రాజా తల్లి రేవతికి పరిచయం ఎలా అయింది. చ‌నిపోయింద‌నుకున్న త‌న త‌ల్లిని రాజా మ‌ళ్లీ ఎలా క‌లుసుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే. తప్పిపోయిన  తల్లి కోసం కొడుకు పడే సాధారణ , చాలాసార్లు చూసిన కథే ఇది. ఈ విషయం ట్రైలర్ లు చూసినా కూడా అర్ధం అయిపోతుంది. లీడ్ క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ వన్ మ్యాన్ షో చూపించాడు ప్రతీ ఫ్రేం లో అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ చూపించిన వరుణ్ తేజ్ . స్టార్ హీరోల కోవలో చేరినట్టే అనిపిస్తుంది. హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపించింది. ఆమె డాన్స్ చాలా బాగా చేసింది. మాస్ స్టెప్స్ లో దిశా చాలా పర్ఫెక్ట్ గా ఒదిగిపోయింది. స్టోరీ రొటీన్ అయినా పూరీ ఇంటర్వెల్ బ్యాంగ్ ని చాలా బాగా రాసుకున్నాడు. చాలా చోట్ల సీన్ లు చక్కగా సింక్ అయ్యాయి కూడా. ఆలీ కామెడీ బాగుంది. రేవతి – వరుణ్ ల మధ్య తల్లీ – కొడుకు కెమిస్ట్రీ బాగుంది.

 

నెగెటివ్ లు : 

పూరీ జగన్నాథ్ అనగానే ముందు డైలాగుల మీద చాలా ఆశలు పెట్టుకుంటారు కానీ ఈ మధ్య ఆయన సినిమాల్లో ఇవి బాగా మిస్ అవుతున్నాయి అనే కంప్లైంట్ ఉంది.  బ్రహ్మానందం పాత్ర ని వెస్ట్ చేసారు. చాలా చోట్ల లాజిక్ లు మిస్ చేసి వరసగా చివ్వర్లో ఒకదాని తరవాత ఒకటి అర్ధం లేని సీన్ లు రాసుకుని క్లైమాక్స్ కి సినిమాని లాక్కోచ్చేసారు. కొన్ని పాత్రలకి ముగింపు కూడా ఇవ్వనే లేదు. ఫస్ట్ హాఫ్ పరవాలేదు అనిపించినా సేసిండ్ హాఫ్ లో చాలా భారీ డ్రాగ్ ఉంది. 

 

మొత్తంగా ::

పూరీ జగన్నాథ్ లో పస తగ్గిపోతోంది అన్న వారికి ఈ సినిమా మరొక ఊతంగా నిలుస్తుంది. మొదటి భాగం పరవాలేదు అనిపించి ఇంటర్వెల్ బ్యాంగ్ ఆదరకోట్టేసిన పూరీ సెకండ్ హాఫ్ లో ఎందుకు అంతా తీవ్రంగా సినిమాని సాగాదేసాడు అనేది తెలియలేదు. సినిమాలో పూర్తి పాజిటివ్ గా వరుణ్ తేజ్ నిలిచాడు. స్టార్ హీరోల సరసన చేరడానికి పెర్ఫెక్ట్స్ స్టార్ అవుతాడు అని చెప్పచ్చు. మాస్ సినిమాలకి కూడా చక్కగా సరిపోతాడు . అతని క్యారెక్టర్ ని ట్యూన్ చెయ్యడంలో వరుణ్ తేజ్ చాలా సక్సెస్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ సినిమా ఫ్లేవర్ బాగా తగ్గింది కానీ టైం పాస్ కోసం ఒక్కసారి చూడచ్చు . లోఫర్ – ఎ పూరీ జగన్నాథ్ టైం పాస్ !

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -