Friday, May 9, 2025
- Advertisement -

వాజ్‌పేయిని ప‌రామ‌ర్శించేందుకు ఎయిమ్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ…

- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య‌ప‌రిస్థితి డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టికే ప‌వురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఏయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయిని పరామర్శించారు. వాజ్‌పేయి ఆరోగ్యం మ‌రింత విష‌మించ‌డంతో వివిధ పార్టీల నాయ‌కులు ఎయిమ్స్ కు త‌ర‌లి వ‌స్తున్నారు. అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుస్మాస్వరాజ్ లు ఆసుపత్రిలోనే ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

ప్రస్తుతం వాజ్ పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంద‌ని ఎయిమ్స్ వైద్యులు బులెటిన్ విడుద‌ల చేయ‌డంతో ఎప్పుడు ఏంజ‌రుగుతుందో న‌నే ఆందోళ‌న భాజాపా నాయ‌కుల్లో వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం వాజ్‌పేయికి వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు.

బీజేపీ ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి రావాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించింది. మరోవైపు, మరి కాసేపట్లో వాజ్ పేయి ఆరోగ్యం గురించి మరో హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు.

93 ఏళ్ల వాజ్ పేయి కిడ్నీ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా.. జూన్ 11న హాస్ప‌ట‌ల్లో చేరారు. బుధ‌వారం రాత్రి 7.15 నిమిషాల‌కు ఎయిమ్స్‌కు వ‌చ్చిన మోదీ.. అక్క‌డ సుమారు 50 నిమిషాల పాటు గ‌డిపారు. వాజ్‌పేయి ముందు నుంచి డ‌యాబెటిక్ పేషెంట్‌. చాన్నాళ్ల నుంచి ఆయ‌న‌కు ఒకటే కిడ్నీ ప‌నిచేస్తున్న‌ది.

2009లో ఆయ‌న‌కు గుండెపోటు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి వాజ్‌పేయి జ్క్షాప‌క శ‌క్తి కూడా తగ్గింది. ప్ర‌స్తుతం వాజ్‌పేయి ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్లు ఉద‌యం ఎయిమ్స్ వైద్యులు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -