వేల కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న నీరవ్ మోదీ జనవరి 7వ తేదీన భారత్‌ను వదిలేసి పారిపోయాడు. వేల కోట్ల రుణం ఎగ్గొట్టడంతో దేశంలో సంచలనం సృష్టించింది. ఎట్టకేలకు నీరవ్‌మోదీ సోమవారం హాంకాంగ్‌లో అరెస్టయినట్లు సమాచారం వస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
రూ.13 వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకుని ఎగ్గొట్టాడు. దీనిపై భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. నీరవ్ మోదీని ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర ఉండి మరీ విమాన టికెట్లు ఇచ్చి పంపించాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
నీరవ్‌మోదీ దేశం నుంచి పారిపోయినప్పటి నుంచి సీబీఐ విచారణ చేపట్టింది. ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని నీరవ్ మోదీ ఆస్తులు, ఆభరణాల దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. వారి ఆస్తులను జప్తు చేశారు.
అయితే నీరవ్‌మోదీని అరెస్ట్ చేసినా వెంటనే భారత్‌కు తీసుకొస్తారా లేదా అక్కడే విచారణ చేపడతారా అనే విషయం ఇంకా తెలియలేదు