Thursday, April 25, 2024
- Advertisement -

ఇస్రో సైంటిస్టు అరెస్టు.. సీబీఐ విచార‌ణ‌కు ఆదేశం

- Advertisement -

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో మాజీ శాస్త్ర‌వేత్త నంబీ నారాయ‌ణ‌న్‌ను గ‌తంలో గూఢ‌చ‌ర్యం కేసులో అరెస్టు అయ్యారు. ఆ కేసుకు సంబంధించి గురువారం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ గూఢ‌చ‌ర్యం అరెస్టు కేసును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ విచార‌ణ చేప‌డుతుంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది.

శాస్త్ర‌వేత్త నంబీ నారాయ‌ణ‌న్‌ను గూఢ‌చ‌ర్యం కేసులో అరెస్టుకు సంబంధించిన కేసును తాజాగా జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. దీనిపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించింది. శాస్త్ర‌వేత్త నారాయ‌ణ‌న్‌ను కేర‌ళ పోలీసులు అక్ర‌మంగా అరెస్టు చేసిన‌ట్టు సుప్రీం మాజీ న్యాయ‌మూర్తి డీకే జెయిన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా న్యాయ‌స్థానం ఈ తీర్పును వెలువ‌రించింది.

ఈ విష‌యం అత్యంత సీరియ‌స్ అంశ‌మ‌ని పేర్కొంది. .ఈ అరెస్టు విష‌యంపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ లోతైన విచార‌ణ జ‌ర‌పాల‌ని తెలిపింది. సీబీఐ డైర‌క్ట‌ర్‌కు కోర్టు కేసు కాపీ వెళ్తుంద‌ననీ, చ‌ట్ట ప్ర‌కారం సీబీఐ విచార‌ణ చేప‌డుతుంద‌ని సుప్రీం తెలిపింది. ఈ కేసులో మూడు నెల‌ల్లోగా సీబీఐ త‌న నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ధ‌ర్మాసనం పేర్కొన్న‌ది. అలాగే, ఈ కేసు వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయకూడ‌ద‌ని తెలిపింది.

కాకతీయగడ్డపై రుద్రమ తర్వాత మళ్లీ షర్మిలే.. !

టీకా తీసుకన్న సర్పంచ్ మృతి

కీర‌దోస‌.. బరువు త‌గ్గించే సులువైన మార్గం..!

తేలిక‌గా తీసుకోవ‌ద్దు.. క‌రోనాపై ఎయిమ్స్‌ చీఫ్‌ వార్నింగ్‌!

నవీన్ పోలిశెట్టికి పెరుగుతున్న డిమాండ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -