Saturday, April 20, 2024
- Advertisement -

ఆసియాకప్ : సూపర్ 4 లో టీమిండియాతో ఢీ కొట్టేది ఎవరు ?

- Advertisement -

దుబాయ్ వేదికగా జరుగుతున్నా ఆసియాకప్ 2022 లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించి అలవోకగా సూపర్ 4 లోకి దూసుకెళ్లింది. మొదటి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడి.. చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత పసికూన హాంకాంగ్ జట్టును కూడా మట్టి కరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటికే సూపర్ 4 కు చేరుకున్న టీమిండియాతో తలపడే తరువాతి జట్టు ఏది అనే దానిపై ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గ్రూప్ బి నుంచి అఫ్గానిస్తాన్ మరియు శ్రీలంక ఇప్పటికే సూపర్ 4 కు చేరుకోగా.. బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఇక గ్రూప్ ఏ లో భారత్ సూపర్ 4 లో నిలువగా.. తదుపరి స్థానం కోసం పాకిస్తాన్ హాంకాంగ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్ల మద్య శుక్రవారం ( నేడు ) డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సూపర్ 4 లో ఇండియాతో తలపడనుంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అన్నీ విభాగాల్లోనూ బలమైన జట్టుగా ఉంది.

అందువల్ల హాంకాంగ్ పై పాక్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగని హాంకాంగ్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. టీమిండియాతో జరిగిన గత మ్యాచ్ లో గెలుపుకోసం గట్టిగానే పోరాడింది. ఒకవేళ ఈ రెండు జట్ల మద్య జరిగే మ్యాచ్ లో పాక్ గెలిస్తే మరొకసారి ఇండియా పాకిస్తాన్ సమరానికి తెరలేస్తుంది. ఏది ఏమైనప్పటికి ఇవాళ జరిగే హాంకాంగ్ పాకిస్తాన్ జట్ల మద్య మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం టీమిండియాతో తలపడనుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -